వరి ఉత్పత్తిలో బాన్సువాడే ఫస్ట్​ :  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి

వరి ఉత్పత్తిలో బాన్సువాడే ఫస్ట్​ :  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి

కోటగిరి, వెలుగు : రాష్ట్రంలో వరి ఉత్పత్తి, ఉత్పాదకతలో బాన్సువాడ నియోజకవర్గమే నెం.1 స్థానంలో ఉందని, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు విక్రయించాలని, దళారులకు అమ్మి  మోసపోవద్దని బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతులకు సూచించారు.

కోటగిరి, పోతంగల్, వర్ని, చందూర్, రుద్రూర్ మండలల్లో గురువారం సొసైటీ కేంద్రాల్లో ఆగ్రో  ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు.  ‘ఏ’ గ్రేడ్ వడ్లు క్వింటాల్​కు మద్దతు ధర రూ.2320, ‘బీ’ గ్రేడ్ క్వింటాల్​కు  రూ.2300 ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.  

అనంతరం పోతంగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. హెగ్డోలిలో మార్క్ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన సన్‌‌‌‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. నూతనంగా ఏర్పడిన పోతంగల్ మండల కేంద్రంలో తాత్కాలిక ఎంపీడీవో కార్యాలయాన్ని  ఎమ్మెల్యే ప్రారంభించారు.

కార్యక్రమంలో కోటగిరి ఏఎంసీ చైర్మన్ హన్మంతు, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్​బాబా, తహసీల్దార్ గంగాధర్, సింగిల్​ విండో చెర్మన్ కూచి సిద్దు, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, షాహిద్ , మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, ఎం.ఏ.హకీమ్, ఏజాజ్ ఖాన్, డీఆర్‌‌‌‌‌‌‌‌డీవో సాయాగౌడ్, కోటగిరి ఏవో రాజు, పోతంగల్ ఏవో నిశిత తదితరులు పాల్గొన్నారు.