శభాష్ టీమిండియా : ఫలితాన్ని మార్చేసిన ఒకే ఒక్క ఓవర్

శభాష్ టీమిండియా : ఫలితాన్ని మార్చేసిన ఒకే ఒక్క ఓవర్

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 10 పరుగులు అవసరం కాగా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన అదే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి బంగ్లాను పోటీలో లేకుండా  చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మ్రితి మందాన(13), షఫాలి వర్మ(19) మంచి ఆరంభాన్ని ఇచ్చినా.. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు దాన్ని కొనసాగించలేకపోయారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(0) డకౌట్ కాగా, జెమీమా రోడ్రిగ్స్ (8), యస్తిక భాటియా(11), హర్లీన్ డియోల్(6), దీప్తి శర్మ(10).. ఇలా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో టీమిండియా కోలుకోలేకపోయింది. 95 పరుగులే పరిమితమైంది.

అనంతరం 96 పరుగుల లక్ష్య చేధనకు బంగ్లా బ్యాటర్లు 87 పరుగులకే కుప్పకూలారు. టీమిండియా బౌలర్ల ధాటికి టెస్ట్ ఆటకు పరిమితయ్యారు. వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా..  లక్ష్యం చిన్నది కావడంతో ఒకానొక సమయంలో బంగ్లా టార్గెట్‌ను చేధించేలానే కనిపించింది. అయినప్పటికీ.. భారత మహిళా బౌలర్లు పట్టు వీడలేదు. దీప్తి శర్మ (3/12), షెఫాలీ వర్మ (3/15), మిన్ను మణి (9/2) బంగ్లా పతనాన్ని శాసించారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 జులై 13న జరగనుంది.