
బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో తెరకెక్కిన చిత్రం ‘బాపు’. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. దయా దర్శకుడు. రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 21న సినిమా విడుదలవుతున్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చూశాక ఓ క్యూరియాసిటీ, మంచి సినిమా అవుతుందనే నమ్మకం కలిగాయి.
ఈ సినిమాకి అన్నీ గుడ్ వైబ్స్ వున్నాయి’ అని చెప్పాడు. మరో అతిథి హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘బ్రహ్మాజీ సహా అందరూ నేచురల్‌గా నటించారు. ట్రైలర్‌లో రా ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నా’ అన్నాడు. దర్శకులు చందూ మొండేటి, బుచ్చిబాబు సాన, సంగీత దర్శకుడు భీమ్స్ బెస్ట్ విషెస్ చెప్పారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ ‘ఇందులో ఓ మంచి పాత్ర పోషించాను. సినిమా క్రెడిట్ అంతా మా దర్శకుడికి దక్కుతుంది. సినిమాకు వచ్చే కలెక్షన్స్ నుంచి నా పారితోషికం ఇస్తానన్నారు నిర్మాత.
అందరూ థియేటర్స్‌కు వెళ్లి మా రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి (నవ్వుతూ)’ అని అన్నారు. తన కెరీర్‌లోనే మర్చిపోలేని సినిమా ఇదని ధన్య బాలకృష్ణ చెప్పింది. దర్శకుడు దయ, నిర్మాత భాను ప్రసాద్ రెడ్డి, నటులు ‘బలగం’ సుధాకర్ రెడ్డి, మణి ఏగుర్ల, రచ్చ రవి, మ్యూజిక్ డైరెక్టర్ ద్రువన్, లిరిక్ రైటర్స్ కాసర్ల శ్యామ్, పూర్ణాచారి, ఎడిటర్ అనిల్, డీవోపీ వాసు పెండెం తదితరులు పాల్గొన్నారు.