బరాబర్ ప్రేమిస్తా టీజర్ విడుదల

బరాబర్ ప్రేమిస్తా టీజర్ విడుదల

‘రామ్ నగర్ బన్నీ’ చిత్రంతో హీరోగా పరిచయమైన చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’.  సంపత్ రుద్ర దర్శకత్వంలో  గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు.  మేఘనా ముఖర్జీ హీరోయిన్. ఈ మూవీ టీజర్‌‌‌‌ను డైరెక్టర్ వీవీ వినాయక్ లాంచ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో చంద్రహాస్ మాట్లాడుతూ ‘నా రెండో సినిమా ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఇది ఉంటుంది. టీజర్‌‌‌‌కొస్తున్న రెస్పాన్స్‌‌ చూస్తుంటే హ్యాపీగా ఉంది’ అని చెప్పాడు. దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ ‘ఇదొక ఇంటెన్స్ లవ్‌‌స్టోరీ.  ఆడియెన్స్‌‌కు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అని చెప్పాడు.  షూటింగ్ పూర్తయిందని త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.