US Elections 2024: అమెరికా అధ్యక్ష రేసులో కమలా హ్యారిస్..

US Elections 2024: అమెరికా అధ్యక్ష రేసులో కమలా హ్యారిస్..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్స్ తరఫున వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ను నామినేట్ చేస్తున్నట్లు బరాక్ ఒబామా ప్రకటించారు. జో బైడెన్ అధ్యక్ష రేసు నుండి తప్పుకున్న నేపథ్యంలో కమలా హ్యారిస్ బరిలో నిలిచింది. దీంతో అమెరికా అధ్యక్షురాలిగా పోటీలో నిలిచిన తోలి భారత సంతతి మహిళగా కమలా హ్యారిస్ నిలిచారు. కమలా హ్యారిస్ ను ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎన్నుకున్నట్లు స్వయంగా బరాక్ ఒబామా, మిషెల్ కమలా హ్యారిస్ కు ఫోన్ కాల్ ద్వారా తెలియజేశారు.

కమలా హ్యారిస్ ను ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎన్నుకోవడం తమకు గర్వంగా ఉందని తెలిపారు ఒబామా, మిషెల్.ఇది చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు మిషెల్ ఒబామా. బరాక్ ఒబామా, మిషెల్ ఒబామాలు అందించిన ప్రోత్సహం మరువలేనిదని, అది మాటల్లో చెప్పలేనిది అన్నారు కమలా హ్యారిస్. కమలా హ్యారిస్ కు తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని, అమెరికా ప్రెసిడెంట్ గా కమలా అద్భుతాలు సృష్టింస్తుందని నమ్ముతున్నానని ఒబామా అన్నారు. ప్రస్తుతం దేశం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రెసిడెంట్ గా కమలా హ్యారిస్ గెలుపు కోసం తమ సర్వశక్తులు ఒడ్డుతామని అన్నారు బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా.