హైదరాబాద్, వెలుగు: క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్ చెయిన్ బార్బెక్యూ నేషన్ విస్తరణకు రెడీ అయింది. హైదరాబాద్‌లో సంస్థకు ఇది వరకే 13 రెస్టారెంట్లు ఉండగా, నార్సింగి, నల్లగండ్లలోనూ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. బార్బెక్యూ నేషన్ హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో తన తాజాగా రెస్టారెంట్‌ను ప్రారంభించిన సందర్భంగా సంస్థ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మన్సూర్ మెమన్ మీడియాతో మాట్లాడుతూ తమకు యూఏఈ, మలేషియాలోనూ రెస్టారెంట్లు ఉన్నాయని, రాబోయే ఆర్నెళ్లలో సౌదీ అరేబియా మార్కెట్లోకి అడుగుపెడతామని చెప్పారు.
కొత్త రెస్టారెంటులో 116 మంది కూర్చోవచ్చని, దీని కోసం రూ.మూడు కోట్లు ఇన్వెస్ట్ చేశామని చెప్పారు. కస్టమర్లకు 70కి పైగా వంటకాలు వడ్డిస్తున్నామని వివరించారు.