క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రికార్డు నమోదైంది. సాధారణంగా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టడమే చాలా అరుదు. ఇప్పటివరకూ 14 మంది ఆటగాళ్లు మాత్రమే ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టారు. ఈ జాబితాలో సర్ గ్యారీ సోబర్స్ మొదటివారైతే, ఢిల్లీకి చెందిన ప్రియాంష్ ఆర్య చివరి వాడు. ఇలాంటి క్రికెట్ ప్రపంచంలో ఓ అనామక బ్యాటర్ వరుసగా 8 బంతుల్లో 8 సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. తద్వారా అగ్రదేశాల క్రికెట్ అభిమానులు సైతం తన పేరు పలికేలా చేశాడు.
స్పెయిన్ వేదికగా జరిగిన టీ10 మ్యాచ్‌లో బార్సిలోనా ఆటగాడు అలీ హసన్ ఈ ఘనత సాధించాడు. తాను ఎదుర్కొన్న వరుస ఎనిమిది బంతులను ఎనిమిది సార్లు స్టాండ్స్‌లోకి పంపాడు. మొదట ఏడో ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన అలీ ఖాన్.. ఎనిమిదో ఓవర్‌లో మరోసారి స్ట్రైక్ అందుకొని వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. దాంతో, వరుసగా 8 బంతుల్లో 8 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రెకార్డుల్లోకెక్కాడు. మొత్తంగా 16 బంతులు ఎదుర్కొని 8 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 55 పరుగులు చేశాడు. అలీ హసన్ విధ్వంసపు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read : మా అభిమానులు మీరంటే పడి చస్తారు
— Sunil Gavaskar (@gavaskar_theman) November 20, 2024