డాక్టర్లు షాక్:మహిళ కడుపులో 2కేజీల వెంట్రుకలు

డాక్టర్లు షాక్:మహిళ కడుపులో 2కేజీల వెంట్రుకలు

సాధారణంగా కొంతమంది మట్టిని తినడం, గోడలకున్న సున్నం తినడం, బలపాలు వంటివి తినడం చూస్తుంటాం.అయితే వెంట్రుకలు తినడం చూశారా..? యూపీకి చెందిన ఓ యువతి తన వెంట్రుకలను తానే తింటుంది. ఒకటి కాదు రెండు..ఐదేళ్ల వయస్సునుంచి 16 సంవత్సరాలుగా తన వెంట్రుకలు తానే తింటోంది. గత కొద్దికాలంలో కడుపునొప్పితో బాధపడుతున్న ఆ బాలికను డాకర్ వద్ద తీసుకెళ్లగా.. స్కాన్ చేస్తే అసలు విషయం బయటపడింది. 

యూపీలోని బరేలీకి చెందిన 21 యేళ్ల యువతి గత 16యేళ్లుగా వీలు చిక్కినప్పుడల్లా తన వెంట్రులను పీక్కుతుంటుంది. వైద్యపరిభాషలో ఇలాంటి లక్షణాన్ని ట్రైకోఫాగియా లేదా రాపుంజెల్ సిండ్రోమ్ గా నిర్ధారించారు. ఈ జబ్బు ఉన్న వారు జుట్టును తినడం అలవాటు చేసుకుంటుంది. 

ALSO READ | టార్గెట్ 2026: మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా హైలెవెల్ మీటింగ్..

యేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆమె కడుపులో వెంట్రుకలున్నట్లు గుర్తించారు. ఆపనరేషన్ చేయాలని అన్నారు. 

ట్రైకోఫాగియా అనే దీర్ఘకాలిక మానసిక రోగం వల్ల.. వ్యక్తులు తమ జుట్టును తింటుంటారు. ఇది తరుచుగా ట్రైకోటిల్లోమానియాతో బాధపడుతున్నవారు సొంత వెంట్రులను తినడం జరుగుతుందని బరేలీలోని జిల్లా ఆస్పత్రికి చెందిన సర్జన్ డాక్టర్ ఎంపీ సింగ్ చెప్పారు. 

రోగ నిర్ధారణ జరిగిన తర్వాత ఆస్పత్రిలో ఆ యువతికి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు డాక్టర్ సింగ్. ఐదుసంవత్సరాల వయసునుంచి ఆమె తన జుట్టును తింటున్నట్లు అంగీకరించింది. సెప్టెంబర్ 26న ఆపరేషన్ చేసి ఆమె కడుపులోంచి వెంట్రుకలను బయటకు తీశారు.