Barinder Sran: అంతర్జాతీయ క్రికెట్‌కు భారత ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్

Barinder Sran: అంతర్జాతీయ క్రికెట్‌కు భారత ఫాస్ట్ బౌలర్ రిటైర్మెంట్

భారత లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బరీందర్ స్రాన్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గురువారం (ఆగస్టు 29) అతడు ఇంస్టాగ్రాం వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. 31 ఏళ్ళ ఈ ఫాస్ట్ బౌలర్ 2016లో ధోని కెప్టెన్సీలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే భారత జట్టు తరపున కేవలం 6 వన్డేలు.. రెండు టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడగలిగాడు. 

పేలవ ప్రదర్శన కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత రీ ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. ఎనిమిదేళ్ల తర్వాత తన ఆటకు గుడ్ బై చెప్పాడు. స్రాన్ వన్డేల్లో ఏడు వికెట్లు, టీ20ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్ విషయానికి వస్తే 137 వికెట్లు  తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఆడాడు. మొత్తం 24 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 18 వికెట్లు తీశాడు.

Also Read :- బంగ్లాదేశ్‎పై ఓటమి ఎఫెక్ట్

ఇన్‌స్టాగ్రామ్‌ స్రాన్ మాట్లాడుతూ.. భారత జట్టు తరపున ఆడడం కెరీర్ లో మర్చిపోలేని క్షణాలు. నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన కోచ్‌లు, మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి గా ఉన్నాను". అని ఈ పేసర్ చెప్పుకొచ్చాడు. స్రాన్ తన చివరి మ్యాచ్ ను ఫిబ్రవరి 2021లో పంజాబ్ తరపున విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. మధ్యప్రదేశ్‌పై జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో 24 పరుగులు చేసిన స్రాన్.. బౌలింగ్ లో 91 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.