మధ్యప్రదేశ్ బింద్ జిల్లాలోని జైలు బ్యారాక్ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 22 మంది ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని బింద్ జిల్లా హాస్పిటల్ కు తరలించారు. తర్వాత వారిలో ఆరుగురిని గ్వాలియర్ హాస్పిటల్ కు రిఫర్ చేశారు. గోడ కూలిన టైంలో ఖైదీలు నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 5 గంటల టైంలో గోడ కూలిందని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలే కారణమన్నారు ఎస్పీ మనోజ్ సింగ్. జైలు 150 ఏళ్ల క్రితం నిర్మించారని చెప్పారు. బారాక్ నంబర్ 6 పూర్తిగా ధ్వంసమైందన్నారు. జైలులోని 7 బ్యారాకుల్లో 255 మంది ఖైదీలు ఉన్నారని చెప్పారు.
Madhya Pradesh | Barrack wall of Bhind jail collapsed; 22 inmates injured
— ANI (@ANI) July 31, 2021
This jail is around 150 years old. Barrack 6 was completely destroyed after its wall collapsed. 22 critically injured inmates rescued & sent to hospital. No casualty reported: Manoj Kumar Singh, SP Bhind pic.twitter.com/B6lHSR7taE