టీజీపీఎస్సీ దగ్గర ఆందోళన.. బర్రెలక్క అరెస్ట్

టీజీపీఎస్సీ దగ్గర ఆందోళన.. బర్రెలక్క అరెస్ట్

హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్ సీ కార్యాలయం దగ్గర నిరుద్యోగుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది . గ్రూప్ 2,3 పోస్టులను పెంచాలని, డిసెంబరులో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. డీఎస్సీని అక్టోబర్‌కు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. 

టీజీపీఎస్ సీ దగ్గర నిరుద్యోగులకు మద్దతుగా ఆందోళనకు దిగిన బర్రెలక్క(శిరీష)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను పీఎస్ కు తరలించారు. పోలీసులు వాహనంలో తీసుకెళ్తుంటే..  సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నిరుద్యోగుల తరపున పోరాడుతుంటే తనను అరెస్ట్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పట్ల నిర్లక్షం చేయకూడదన్నారు.  

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పశువుల కాపరి అయిన(బీకామ్ గ్రాడ్యుయేట్) బర్రెలక్క ఫేమస్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు.