రోడ్డు క్రాసింగ్స్​ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని ధర్నా

చండ్రుగొండ, వెలుగు : నేషనల్ హైవే పై ప్రమాదాలను అరికట్టేందుకు రోడ్డు క్రాసింగ్ ల వద్ద బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని గురువారం చండ్రుగొండ లో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.

ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లే హైవే రోడ్డు వద్ద ఆందోళనకారులు పార్టీ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు.  స్పీడ్ కంట్రోల్ చేసేందుకు బారికేడ్ల ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్  వెలిగేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ లీడర్లు వేణు, వెంకటాచారి, రాజా,కాంతారావు, రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.