
జీడిమెట్ల, వెలుగు: ఎన్నికల బందోబస్తులో భాగంగా ట్రాఫిక్ కంట్రోల్ కోసం వాడిన బారికేడ్లు చోరీకి గురైన ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో జరిగింది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల నేపథ్యంలో వారం రోజుల కిందట బల్దియా కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆఫీసుకు దగ్గరలోని చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
పోలింగ్, కౌంటింగ్ ముగిసినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు ఆ బారికేడ్లను తొలగించలేదు. మంగళవారం వాటిని అవసరమైన ప్రాంతానికి తరలించేందుకు ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వెళ్లగా.. బారికేడ్లు కనిపించలేదు. దీంతో వారు జీడిమెట్ల పీఎస్ లో కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.