నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. PUC ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి జాదవ్ బబ్లూ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు తెలిపారు. ఇక్కడే చదువుతున్న తన సోదరుడితో మధ్యాహ్నం వరకు జాదవ్ బబ్లూ మాట్లాడాడని తోటి విద్యార్థులు తెలిపారు. ఆ తర్వాత బబ్లూ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన విద్యార్థి జాదవ్ బబ్లూ గుర్తించారు. సంబంధిత అధికారులు జాదవ్ బబ్లూ తల్లిదండ్రులకు సమాచారాన్ని ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.