నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజు అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారికి అష్టోత్తర నామార్చన చతుషష్టి ఉపచార వంటి పూజలను వేద పండితులు నిర్వహించారు.
మల్లె పుష్పార్చన ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అదేవిధంగా అమ్మవారికి కిచిడి, రవ్వకేసరి వంటి నైవెద్యాలను సమర్పిస్తున్నారు.