ఘనంగా బాసర ట్రిపుల్ ఐటీ అలుమ్నీ

ఘనంగా బాసర ట్రిపుల్ ఐటీ అలుమ్నీ

హైదరాబాద్, వెలుగు: సిటీలోని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్​మెంట్ ఇనిస్టిట్యూట్​లో శనివారం బాసర ట్రిపుల్ ఐటీ అలుమ్నీ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏఈఈలుగా సెలెక్ట్ అయిన 75 మంది ట్రిపుల్​ఐటీ పూర్వ విద్యార్థులను అధ్యాపకులు, సిబ్బంది సత్కరించారు. 

తమ విజయాల్లో ట్రిపుల్​ఐటీ అధ్యాపకులు, సిబ్బంది పాత్ర కీలకమని పూర్వ విద్యార్థులు తెలిపారు. వీసీ వెంకటరమణ మాట్లాడుతూ.. యూనివర్సిటీ బలోపేతానికి తీసుకున్న నిర్ణయాలను వివరించారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేలా కోచింగ్​సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.