మూఢ నమ్మకాలను వ్యతిరేకించిన అభ్యుదయవాది బసవణ్ణ.అప్పట్లో ఆడవారికి, దళితులకు ధార్మిక, సామాజిక, ఆర్థిక,రాజకీయ హక్కు లు ఉండేవి కావు. బసవణ్ణ వీరందరికీ అన్నిహక్కు లు కల్పించాడు. వర్గ, వర్ణ, లింగ భేదాలను తెం చివేసి, ఒకనూతన సమాజాన్ని స్థాపించాడు. ఆధునిక సమాజ నిర్మాణంలోబసవణ్ణ చూపిన ముందుచూపు ఇన్ని శతాబ్దాల తర్వాత కూడాస్ఫూర్తినిస్తొంది.
లిం గాయత ధర్మ సృష్టికర్త మహాత్మా బసవే-శ్వరుడు విశ్వగురువు. ఆయన మహా మా-నవతావాది. సంఘ సంస్కర్త. కుల, మత వర్గ, వర్ణవ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. ఈ వ్యవస్థను రూపుమాపడానికి క్రీస్తు శకం 12వ శతాబ్దం లోనే పోరాడిన సాఘిక విప్లవకారుడు. స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను తొలగించడానికి కృషి చేసినఅభ్యుదయవాది. బూజు పట్టిన మూఢాచారాలకు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటాఎగరేసిన మొదటి సంఘ సేవకుడు బసవేశ్వరుడు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని 12వశతాబ్దం లోనే గళమెత్తాడు. మొట్టమొదటి కులాంతర వివాహం చేసిన గొప్ప సంస్కర్త. సామాజిక అసమానతల్ని రూపుమాపి వెలుగులు నింపిన అభ్యుదయవాది. మనుషులందరూ శాంతి, సామరస్యాలతో సహజీవనం నెరపాలని బోధించాడు. సమాజాన్ని ప్రభావితంచేసేలా బసవన్న తన సొంత ఒరవడిలో ఓ కొత్త ధర్మాన్ని సృష్టించాడు. అదే లింగాయత్ ధర్మం.
సమాజంలో అనేక మూఢాచారాలు బలంగా ఉన్నరోజుల్లో … క్రీస్తు శకం 1134 లో ఆనందనామ సంవత్సర వైశాఖ మాస అక్షయ తృతీయ రోజున ఇప్పటి కర్ణాటక రాష్ట్ర బీజాపూర్ జిల్లా బాగేవాడి గ్రామంలోమదాంబిక, మాదిరాజు దంపతులకు బసవణ్ణ జన్మించాడు. కులభేదాలతో కునారిల్లుతున్న సమాజంలో దేవుడినే భక్తుడి వద్దకు తీసుకువచ్చాడు. ఇష్ట లింగాన్నికనిపెట్టాడు. పరమశివుడికి ప్రతిరూపమైన ఇష్టలింగాన్ని చేతికిచ్చి గుడి సంస్కృతిని, కుల వ్యవస్థను అంతమొందించాడు. మాంసాహారాన్ని వదిలేసి, శాకాహారాన్ని తీసుకోవడం ఇష్ట లింగధారణ, ఇష్టలింగ పూజ….ఇదే బసవణ్ణ సూచించిన భక్తిమార్గం .నరబలి, పశుబలి వంటి అర్థం పర్థం లేని పూజలను బసవణ్ణ పక్కన పెట్టాడు.‘జ్ఞానమే గురువు. ఆచారమే లింగం, దేహమే దేవాలయం, స్త్రీ పురుష భేదం లేదు, శ్రమకు మించిన సౌందర్యం లేదు, పనిని మించిన దైవం లేదు. కష్టాన్ని మిం చిన భక్తి లేదు, భక్తి కన్న మంచి ప్రవర్తనే ముఖ్యం ’ అన్నాడు. చేసే పనిలోనే దేవుడిని చూసేమార్గాన్ని చూపించి ‘కాయకమే కైలాసం’ అనే కొత్తఒరవడికి నాంది పలికాడు మహాత్మ బసవేశ్వరుడు. లింగాయత ధర్మం ఓ విప్లవాత్మకమైన మత రూపం,జాతి వర్గ భేదం లేకుండా ఆసక్తి కలవారందరు దీక్షాసంస్కారము పొందవచ్చునని చెప్పేదే లింగాయతధర్మం .
ఆనాడే స్త్రీకి సమాన హక్కులు
నేటి మన పార్లమెంటరీ వ్యవస్థతో సమానమైన అనుభవ మంటపాన్ని బసవేశ్వరుడు ఆనాడే స్థాపించాడు. అందులో జాతి, కుల, వర్గ, వర్ణ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశం కల్పించాడు. ఇన్ని శతాబ్దాలు గడిచినాగానీ, ఆడవారికి కనీసం మూడోవంతు అవకాశమైనా దక్కడంలేదు. బసవేశ్వరుడు ఆనాడే తన అనుభవ మండపంలో స్త్రీలకు సమానావకాశం కల్పించాడు. అయితే, ఆయన ఉపదేశాలు నేటి సమాజానికి చేరకపోవడం దురదృష్టకరం,బసవేశ్వరుడి పనులను, సందేశాలను నేటి సమాజంపట్టించుకున్ననాడు బసవేశ్వరునికి బుద్ధ భగవానుడి, జైన మహవీరుని వరుసలో సముచిత స్థానం ఇవ్వవలసి ఉంటుంది. బసవణ్ణ పరిపూర్ణ బుద్దుడు, బుద్ధునికి బసవేశ్వరునికి మధ్య పోలికలు ఉన్నాయి. ఆలోచన విధానంలోను, ధర్మ నిర్వహణలోను వీరిద్దరూ ఒకేలాఉంటారు. బుద్ధుడు వర్గాలకు, జెండర్‌కి వ్యతిరేకంగాపోరాడారు, స్త్రీలకు సమాన ధార్మిక హక్కులు కల్పించారు. అలాగే బసవణ్ణ కూడా తన అక్క నాగమ్మకు ధార్మిక సంస్కారం ఇవ్వలేనప్పుడు ఆగ్రహంతో తనజనివారమును (జంధ్యం ) తెంచేశాడు. లింగ భేదం,మఠాలు, ఆశ్రమాలకు వ్యతిరేకంగా పోరాడాడు. తనదేహమే దేవాలయమని, చేసే పనే దైవమని ప్రభోదించాడు.
ప్రత్యేక మతంగా కర్ణాటక గుర్తింపు
కర్ణాటకలోని కూడల సంగమంలో క్రీ.శ.1196లోతన 62వ యేట ఆ పరమాత్ముని సన్నిధికి చేరుకున్నాడు. నేడు ఆ కూడల సంగమం లింగాయతుల పవిత్రక్షేత్రంగా విరాజిల్లుతోంది. నిరాకారుడైన శివుడిని మించిన దైవం లేదన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకొని ఇష్ట లింగధారణ చేసి లింగాయతధర్మానికి బీజాలు వేశాడు. నాడు బసవేశ్వరుడు అంకుర్పారణ చేసిన లింగాయత ధర్మానికి నేడు కర్ణాటకప్రభుత్వం మైనార్టీ హెూదా ఇచ్చి ప్రత్యేక మతంగా పరిగణించాలని కేంద్రానికి సిఫారసు చేసింది.
బసవణ్ణతన ఉపదేశాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేరీతిగా వచనాలు రాశాడు, సాహిత్యపరంగా కూడాబసవేశ్వరుని వచనాలకు చక్కని గౌరవం లభించింది బసవణ్ణ 64 లక్షల వచనాలు రాసినట్టు ప్రతీతి. ప్రస్తుతం కొన్ని వేలు మాత్రమే లభ్యమవుతున్నాయి, సమాజంలో పేరుకున్న వైదిక సనాతన మూఢాచారాలను తన వచనాల ద్వారా ఖండించాడు.పాల్కూరి సోమనాథుడు ఆరాధ్య దైవంగా భావించి‘బసవ పురాణం’ రచించాడు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రాంగణంలో బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 2006 లో రూ.5, 100రూపాయల బసవణ్ణ నాణాలను విడుదల చేసింది.
తెలంగాణ వాసి డాక్టర్ నీరజ్ పాటిల్ ఎంతోకృషితో లండన్‌లో మహాత్మ బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వరుడి జయంతిని ఏటా అధికారికంగా నిర్వహిస్తోంది. ట్యాంక్ బండ్‌పై బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. బసవేశ్వరుడి చరిత్రను పాఠ్యాంశంలో చేర్పించి నేటి పౌరులకు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. కర్ణాటక ప్రభుత్వ కార్యాలయాలలో బసవేశ్వరుడి చిత్రపటాన్ని తప్పనిసరి చేసింది. బసవణ్ణ వచనాలు నేటి మానవాళికి మార్గదర్శకం, విశాల హృదయం, మానవతా వాదానికి మకుటమైన వచనాలను అన్ని భాషలలో అనువదించి ఆయన చరిత్రను నేటి తరానికి తెలియజేస్తే సమాజానికి ఒక మంచి సందేశమిచ్చిన వారమవుతాం .