మోకాళ్లపై కూర్చొని బస్వాపురం భూ నిర్వాసితుల నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా : బస్వాపురం భూ నిర్వాసితులు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. పరిహారం చెల్లించాలని కోరుతూ గత 49 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. నిరసనల్లో భాగంగా సోమవారం రిజర్వాయర్ కట్టపైనే పాయసం వండుకుని తిన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమకు పరిహారం అందించాలని బస్వాపురం భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.