షర్ట్ లేకుండా బీచ్ ని ఆస్వాదిస్తున్న అమెరికా అధ్యక్షుడు.. పిక్ వైరల్

ఎప్పుడూ సూటూ, బూటుతో ఫార్మల్​గా కనిపించే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. బీచ్​లో షర్ట్​లెస్​గా దర్శనమిచ్చారు! క్యాప్​ను రివర్స్​ తిప్పి వేసుకుని, షర్ట్​ విప్పి కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

అతిపెద్ద వయస్సు కలిగిన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు జో బైడెన్​.80ఏళ్ల బైడెన్​.. తన డెలావేర్​లోని ఇంటికి సమీపంలోని బీచ్​కు వెళ్లారు. అక్కడ షర్ట్​ విప్పి, క్యాప్​ను రివర్స్​గా పెట్టుకున్నారు. . ఈ ఫొటోల్లో ఆయన బేస్ బాల్ క్యాప్, సన్ గ్లాసెస్, నీలిరంగు టెన్నిస్ బూట్లు ధరించి హాలీవుడ్ యాక్షన్ హీరోలా కనిపిస్తున్నారు. ఎప్పుడూ బిజీ షెడ్యూల్‌తో తీరికలేకుండా గడిపే బైడెన్ తాజాగా డెలావేర్‌లోని రెహోబోత్  బీచ్‌లో ఇలా సరదాగా కాసేపు సమయాన్ని గడిపారు.

పుతిన్​.. ట్రంప్​ కూడా..!

దేశాధినేతలు.. ఇలా డిఫరెంట్​గా కనిపించడం కొత్త విషయం ఏమీ కాదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్.. 2009లో హార్స్​ రైడ్​కు వెళ్లారు. అక్కడ ఆయన దిగిన ఫొటోలు అప్పట్లో తెగ వైరల్​గా మారాయి. కొన్నేళ్ల క్రితం.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, తన ఫొటోషాప్​ స్కిల్స్​కు పదునుపెట్టినట్టు కనిపించింది. సిల్వెస్టర్​ స్టేలోన్​ శరీరానికి తన తలను మార్ఫ్​ చేసిన ఫొటోను ఆయనే స్వయంగా ట్వీట్​ చేశారు. అప్పట్లో దీనిపై బీభత్సమైన మీమ్స్​ వచ్చాయి. అయితే.. 80ఏళ్ల జో బైడెన్​ మాత్రం.. ఫొటోకు ఫోజిస్తున్నట్టు కనిపించలేదు.   సాధారణంగా ఆయన బీచ్​లో ఉండగా, ఫొటో తీసినట్టే ఉంది. సంబంధిత ఫొటో  డెలావేర్​లోని రెహూబూత్​ బీచ్​లో​ ఆదివారం (జులై 30) తీసినదిగా తెలుస్తోంది.  "రెహూబూత్​ బీచ్​లో ప్రెసిడెంట్​ జో బైడెన్​ ఎంజాయ్​ చేస్తున్న ఫొటో ఇది," అని ఎరిక్​ గెల్లర్​ అనే జర్నలిస్ట్​ ఎక్స్​ ట్విట్టర్​లో ట్వీట్​ చేశారు. బీచ్​లో నడుస్తుండగా.. అధ్యక్షుడు కనిపించినట్టు, వెంటనే ఫోన్​లో మూడు ఫొటోలు తీసినట్టు వివరించాడు.