హైయర్ స్టడీస్ కోసం యూస్ వెళ్తున్న తెలుగు విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉంది. దీంతో అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని యూస్ సెన్సస్ బ్యూరో డేటా ఆధారంగా తెలుస్తోంది. 8 సంవత్సరాల్లో అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. 2016లో 3.2లక్షల మంది ఉంటే అది 2024 నాటికి 12.3లక్షలకు చేరుకుంది.
అమెరికాలో ప్రధాన నగరాలైన కాలిఫోర్నియాలో 2లక్షల మంది, టెక్సాస్ లో 1.5లక్షలు, న్యూజెర్సీలో 1.1 లక్షల మంది తెలుగు మాట్లాడే వారు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 10వేల మంది ఇండియన్స్ అమెరికా H1B వీసా తీసుకుంటున్నారని, అంతేకాదు దాదాపు 60వేల మంది విద్యార్థులు యూనివర్సిటీ చదువులకు వెళ్తున్నారని లెక్కలు ఉన్నాయి. మొత్తం 350 భాషలు యూస్ లో మాట్లాడుతుంటే.. అందులో 11 స్థానంలో తెలుగు భాష ఉంది.