యూఎస్ ప్రాసిక్యూటర్లు చేసిన లంచం, అవినీతి ఆరోపణలను అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తీవ్రంగా ఖండించారు. వారు చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధార మై నవి అని కొట్టి పారేశారు. తమ సంస్థ అత్యున్నత ప్రమాణాలతో పనిచేస్తుందన్నారు. ఆరోపణలపై న్యాయపోరాటం చేస్తానన్నారు.
యూఎస్ ప్రాసిక్యూటర్లు చేసిన లంచం, మోసాలకు సంబంధించి ఆరోపణలపై అదానీ స్పందిస్తూ.. కంపెనీ నిబద్ధతను హైలైట్ చేశారు. తమ కంపెనీ అమెరికన్ చట్టాలకు లోబడి పనిచేస్తుందన్నారు. ఈ ఆరోపణలు తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమన్నారు.
Also Read:-అదానీని అరెస్ట్ చెయ్యరు..నేను గ్యారంటీ ఇస్తా...
అదానీ గ్రూప్ సంస్థలపై వస్తున్న ఆరోపణలతో గురువారం నాడు జరిగిన స్టాక్ ట్రేడింగ్ సెషన్ లో అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు 23శాతం పడిపోయాయి. స్టాక్ ధరల్లో అస్థిరత నెలకొంది. దీంతో అదానీ మీడియా ముందుకు వచ్చి తన పై ఆరోపణలను ఖండించారు.