
మలయాళ ఇండస్ట్రీ నుంచి వారానికో ఓ కొత్త సినిమా ఓటీటీకి వస్తూనే ఉంటుంది. అక్కడీ మేకర్స్ తెరకెక్కించే స్టైల్ లో మన ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. వారు సహజమైన కథలతో రావడమే కాకుండా ఆసక్తిని కలిగించే స్క్రీన్ ప్లేతో వచ్చి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తున్నారు.
అంతేకాకుండా మలయాళ నటులు చేసే సహజమైన నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలా మినిమం గ్యారెంటీ హిట్స్ అందించే ఓ మలయాళ నటుడి సినిమాకు భలే క్రేజ్ పెరుగుతుంది. ఆ నటుడు ఎవ్వరో కాదు బేసిల్ జోసెఫ్.
మలయాళ హీరో కం డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ (Basil Joseph)..నటించిన సినిమాలకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ఇటీవలే సూక్ష్మదర్షిని మూవీలో మాన్యువల్గా నటించి మరింత దగ్గరయ్యాడు. మిస్టరీ థ్రిల్లర్గా వచ్చిన సూక్ష్మదర్శినితో, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకున్నాడు. అలాగే ఓటీటీలోను అదరగొట్టింది. ఆ తర్వాత బాసిల్ 'పొన్‌మాన్' (PonMan),'ప్రవీణ్ కూడు షాప్పు' అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్తో వచ్చి, ప్రేక్షకులను అలరించాడు. ఇపుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీతో వచ్చాడు. అదే మరణమాస్ (Maranamass).
మరణమాస్ ఓటీటీ:
బాసిల్ జోసెఫ్ 'మరణమాస్' మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. డార్క్ కామెడీగా వచ్చి కేరళ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. మరణమాస్ సినిమాను మలయాళ హీరో టొవినో థామస్ రూ.8 కోట్ల పరిమిత బడ్జెట్ తో రూపొందించాడు. సుమారు రూ.20 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లతో దుమ్మురేపింది. శివప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేనెల మే15 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, హీరో టొవినో థామస్ మరియు బాసిల్ జోసెఫ్ లకు తెలుగులో మంచి ఫాల్లోవింగ్ ఉంది.
#MaranaMass Digital Streaming Rights Bagged by SonyLiv 🔥#OTT_Trackers pic.twitter.com/8FXqpzfrLL
— OTT Trackers (@OTT_Trackers) April 18, 2025
మరణమాస్ కథ:
ల్యూక్ పిపి (బాసిల్ జోసెఫ్) ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. తన విలక్షణ శైలితో కొన్ని సంఘటనలను లీక్ చేస్తాడు. తనను తాను సిగ్మా మేల్ అని గర్వంగా చెప్పుకునే ల్యూక్, కొత్త తరం యూట్యూబర్ మరియు ఇన్ఫ్లుయెన్సర్, ప్రజల మురికి రహస్యాలను బయటపెట్టడానికి దూసుకెళ్తుంటాడు. అయితే, తన దురుద్దేశంతో కాకుండా సమాజాన్ని శుభ్రపరచడానికి ప్రయత్నిస్తాడు.
ఈ క్రమంలోనే ఆ గ్రామంలో ముగ్గురు వృద్ధులు దారుణ హత్యకు గురవుతారు. అంతేకాకుండా చచ్చిపోయిన వాళ్ల నోళ్లలో అరటిపండ్లు పెడుతూ ఉంటాడు ఓ సీరియల్ కిల్లర్. ఇక ల్యూక్ విచిత్రమైన ప్రవర్తన కారణంగా పోలీసులు.. అతన్ని అనుమానించడానికి మొగ్గు చూపుతారు. స్కూల్ స్టాఫ్ రూమ్‌ను తగలబెట్టడం నుండి ఒక రాజకీయ నాయకుడి చీకటి చరిత్రను లీక్ చేయడం వరకు, అతను గ్రామంలోని ప్రతిఒక్కరికీ తలనొప్పిగా మారుతాడు.
ల్యూక్ పిపి.. జెస్సీ (అనిష్మా అనికుమార్)ని ప్రేమిస్తాడు. కానీ, జెస్సీకి అతనంటే ఇష్టం ఉండదు. దాంతో తనని తరుచూ వేధిస్తూ ఉంటాడు. చివరికి ఆమె ప్రేమని దక్కించుకోవడానికి ఎటువంటి పనులు చేయాల్సి వచ్చింది? అయితే, ఆ ఊళ్లో వృద్ధులను లక్ష్యంగా చేసుకొని వాళ్లను చంపేది ఎవరు? ల్యూక్ పిపి నిజంగానే సీరియల్ కిల్లర్ హా? లేక మంచివాడా? ఈ కథలోని వ్యక్తులకు ఆ ఊళ్లోకి వచ్చే బస్సుకు ఏం సంబంధం? అనేది మిగతా స్టోరీ.