Thriller Review: బాసిల్ జోసెఫ్ ఓటీటీ క్రైమ్ థ్రిల్ల‌ర్ రివ్యూ.. ఒక హ‌త్య‌.. 11 మంది అనుమానితులు..

Thriller Review: బాసిల్ జోసెఫ్ ఓటీటీ క్రైమ్ థ్రిల్ల‌ర్ రివ్యూ.. ఒక హ‌త్య‌.. 11 మంది అనుమానితులు..

ఓటీటీ (OTT) ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరోలు బాసిల్ జోసెఫ్, సాబిన్ షాహిర్లు. లేటెస్ట్గా వీరిద్దరూ కలిసి నటించిన క్లైమ్ థ్రిల్లర్ మూవీ 'ప్రవీణ్ కూడు షాప్పు' (Pravinkoodu Shappu). ఈ మూవీ నేడు (2025 ఏప్రిల్ 11) నుంచి సోనీ లివ్లో (Sony Liv) స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.

బాసిల్ జోసెఫ్:

మలయాళ హీరో కం డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ (Basil Joseph).. నటించిన సినిమాలకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ఇటీవలే సూక్ష్మదర్షిని మూవీలో మాన్యువల్గా, పొన్‌మాన్ లో అజీశ్గా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

ఈ క్రమంలోనే 'ప్రవీణ్ కూడు షాప్పు' మూవీ ఓటీటీకి వచ్చేసింది. ఈ సినిమాకు శ్రీరాజ్ శ్రీనివాస‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఒక హ‌త్య‌...11 మంది అనుమానితులతో డార్క్ థ్రిల్లర్గా డైరెక్టర్ శ్రీనివాసన్ తెరకెక్కించాడు. ఇదే అతని మొదటి సినిమా. 

భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌ ఎలా ఉంది? బాసిల్ జోసెఫ్ గత సినిమాల మాదిరి థ్రిల్లింగ్ అంశాలు ఇందులో ఉన్నాయా? ఈ సినిమాతో బాసిల్ ఎటువంటి మార్క్ సొంతం చేసుకున్నాడనేది రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే:

ఊరి బయట ఒక కల్లు దుకాణం ఉంటుంది. ఓ రోజు రాత్రి పదకొండు మంది సాధారణ కస్టమర్లు, ఆ కల్లు దుకాణంలో తాగడానికి వస్తారు. వారు ఆ రాత్రంతా అక్కడే ఉండి, తాగుతూ అలానే మత్తులో పడుకుంటారు. తెల్లారి లేచి చూసేసరికి ఆ కల్లు దుకాణ యజమాని షాప్‌లోనే ఉరేసుకొని చ‌నిపోయి క‌నిపిస్తాడు. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి CIసంతోష్ (బాసిల్ జోసెఫ్) రంగంలోకి దిగుతాడు.

అత‌డి ఇన్వేస్టిగేష‌న్‌లో దానిని హత్యగా నిర్ధారిస్తాడు. ఘటన స్థలంలో ఉన్న ఆ 11 మందిని ప్రధాన అనుమానితులుగా చేరుస్తాడు. కానీ, కేసు ముందుకు వెళ్లే కొద్దీ నేరస్థుడ్ని కనిపెట్టడంలో ఛాలెంజింగ్ ఎదుర్కొంటాడు? అత‌డి ఇన్వేస్టిగేష‌న్‌లో చివరకు ఏం తెలిసింది? అసలు కల్లు దుకాణంఓనర్ ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది మిగతా స్టోరీ. 

మూవీ విశ్లేషణ:

పోలీసు పాత్రలో కూడా, బాసిల్ తన విభిన్నమైన నటన శైలిని ప్రదర్శించగలిగాడు. ఈ మూవీకి స్క్రిప్ట్ రాసిన దర్శకుడు శ్రీరాజ్ శ్రీనివాసన్ కథను డార్క్ థ్రిల్లర్ అంశాలతో చెబుతాడు. ఉత్కంఠను కలిగిస్తూ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆసక్తి పెంచుతోంది. చివరి 30 నిమిషాలు కథనంలో ఉత్కంఠ రేపుతోంది. ఊహించని మలుపులతో, దర్యాప్తు ఇంటెన్స్గా సాగుతుంది. ముఖ్యంగా హత్య వెనుక ఉన్న ఉద్దేశ్యం, అప్పుడు వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది. షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ ఆ కల్లు దుకాణం లోపలి వాతావరణాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ షార్ప్‌గా మరియు స్టైలిష్‌గా ఉంది. బాసిల్ జోసెఫ్ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఇది.