OTT Thriller: ఓటీటీకి సూక్ష్మదర్శిని హీరో మరో డ్రామా థ్రిల్లర్.. బంగారం, డ‌బ్బు మాత్ర‌మే కాపురాల‌ను నిలబెడతాయా?

OTT Thriller: ఓటీటీకి సూక్ష్మదర్శిని హీరో మరో డ్రామా థ్రిల్లర్.. బంగారం, డ‌బ్బు మాత్ర‌మే కాపురాల‌ను నిలబెడతాయా?

మలయాళ హీరో కం డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ (Basil Joseph)..నటించిన సినిమాలకు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ఇటీవలే సూక్ష్మదర్షిని మూవీలో మాన్యువల్గా నటించి మరింత దగ్గరయ్యాడు. మిస్టరీ థ్రిల్లర్గా వచ్చిన సూక్ష్మదర్శినితో, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకున్నాడు. అలాగే ఓటీటీలోను అదరగొట్టింది. ఇప్పుడు తాజాగా బాసిల్ మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో వచ్చి, ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అదే 'పొన్‌మాన్'(PonMan). 

పొన్‌మాన్ ఓటీటీ:

డ్రామా థ్రిల్ల‌ర్‌గా వచ్చిన పొన్‌మాన్ మూవీని జ్యోతిష్ శంకర్ తెరకెక్కించాడు. ఇందులో బాసిల్ జోసెఫ్తో పాటు లిజోమోల్ జోస్, సజిన్ గోపు, ఆనంద్ మన్మథన్ ముఖ్య పాత్రల్లో నటించారు. నాలంచు చెరువుక్కర్ " నవల ఆధారంగా రూపొందించబడింది. 2025 జనవరి 30న థియేటర్స్లో విడుదలైన ఈ మూవీకి, విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

కథేంటంటే:

బ్రూనో (ఆనంద్ మన్మథన్) ఒక రాజకీయ పార్టీలో యాక్టివ్​గా పనిచేస్తుంటాడు. అతని చెల్లి స్టెఫీ గ్రాఫ్ (లిజోమోల్ జోస్)కి మరియానో ​​(సజిన్ గోపు) అనే వ్యక్తితో పెండ్లి కుదురుతుంది. అతనికి కట్నంగా 25 తులాల బంగారం ఇస్తామని ఒప్పుకుంటారు. కానీ.. అంత డబ్బు బ్రూనో దగ్గర లేకపోవడంతో 13 తులాలు మాత్రమే కొంటాడు. మరో 12 తులాల డబ్బుని పెండ్లి జరిగిన మరుసటి రోజు ఇస్తానని చెప్పి అజీష్ (బాసిల్ జోసెఫ్) దగ్గర బంగారం కొంటాడు.

ALSO READ | రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ కింగ్‌డమ్

పెళ్లికి వచ్చిన చదివింపుల డబ్బుతో ఆ అప్పు తీర్చేయాలి అనుకుంటాడు. కానీ.. అంతలోనే బ్రూనో చర్చికి సంబంధించిన వ్యక్తి​తో గొడవపడతాడు. దాంతో పార్టీ, చర్చి నుంచి ఎవరూ పెండ్లికి వెళ్లరు. దాంతో చదివింపులు రావు. అజీష్ తన 12 తులాల బంగారాన్ని తిరిగి ఇచ్చేయాలని పట్టుబడతాడు. మరియానోని ఎదిరించి బంగారం వెనక్కి తీసుకోవడం కుదరని పని. అప్పుడు అజీష్ ఏం చేశాడు? పార్టీని న‌మ్మి బ్రూనో ఎలా మోస‌పోయాడు? అనేది మిగతా కథ.

పొన్‌మాన్ విశ్లేషణ:

ప్రస్తుత కాల అమ్మాయిల‌కు బంగారం కంటే వారి వ్య‌క్తిత్వం, ఆలోచ‌న విధానం, మంచిత‌న‌మే నిజ‌మైన అభ‌ర‌ణాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ద‌ర్శ‌కుడు ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. క‌ట్న‌కానుక‌లు, లాంఛ‌నాల విష‌యంలో ఉండే అపోహలను కళ్ళకు అద్దినట్లుగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. 

ఇకపోతే మలయాళ సినిమాల్లో ఉండే ఆ సహజమైన భావోద్వేగాల్ని ఈ సినిమాలో చూపించాడు. రెగ్యూలర్ కమర్షియల్ సినిమాల్లా కాకుండా సాధారణ కథతో బరువెక్కిన ఎమోషనల్ పాయింట్స్తో సినిమా తీసి ఆకట్టుకున్నాడు డైరెక్టర్. ఇందులో నటించిన నటులందరూ తమదైన నటనతో మెప్పించారు.

జీవితంలో కొన్ని పరిస్థితులు, మ‌నిషిని ఎలా మారుస్తాయి? వచ్చిన చిన్న చిన్న సమస్యలకు పిరికితనంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది చర్చించిన విధానం బాగుంది. ఇక బాసిల్ మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో వచ్చి తెలుగువారికి సుపరిచితుడిగా మారాడు. ఇక ఆలస్యం ఎందుకు పొన్‌మాన్ మూవీ చూసేయండి.