ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లాలో జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. నేషనల్ చానెల్లో పనిచేస్తున్న ముకేశ్ చంద్రకర్ ను మర్డర్ చేశారు కాంట్రాక్టర్లు. రెండు రోజుల కిందట ముకేశ్ కిడ్నాప్ కు గురవ్వగా...అతని సోదరుడు కంప్లైంట్ తో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
జనవరి 4న చట్టనపర కాలనీలో కాంట్రాక్టర్ సురేశ్ చంద్రకర్ ఇంటి ఆవరణలోని ట్యాంక్ లో ముకేశ్ డెడ్ బాడీని గుర్తించారు. గంగలూరు టూ మీర్తూర్ రోడ్డు నిర్మాణంలో అవినీతి కుంభకోణం వెలుగులోకి తీసుకొచ్చాడు జర్నలిస్టు ముకేశ్. జర్నలిస్ట్ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.