స్థలం లేక హెచ్ఎం రూమ్​లో కూర్చుంటున్న స్టూడెంట్లు

స్థలం లేక హెచ్ఎం రూమ్​లో కూర్చుంటున్న స్టూడెంట్లు

మహబూబ్​నగర్​, వెలుగు: ఎక్కడా స్థలం దొరకనట్లు గవర్నమెంట్​స్కూల్​లో బస్తీ దవాఖానను ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి చెప్పిండని స్కూల్​లో ఉన్న రెండు క్లాస్​ రూమ్​లను విద్యా శాఖ నుంచి హ్యాండోవర్​ చేసుకొని పనులు చేపడుతున్నారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట ప్రైమరీ స్కూల్​లో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం ఉండగా, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 320 మంది చదువుకుంటున్నారు. స్కూల్​కు మొత్తం పది క్లాస్​రూమ్​లు ఉన్నాయి. స్కూల్​ పక్కనే కాలనీకి చెందిన అంబా భవానీ కమ్యూనిటీ హాల్​లోని ఓ రూమ్​లో బస్తీ దవాఖాన కొనసాగుతోంది. ఈ దవాఖానను స్కూల్​లోకి మార్చాలని, ఇందుకోసం రెండు క్లాస్​ రూమ్స్​ను కేటాయించాలని మంత్రి శ్రీనివాస్​గౌడ్​చెప్పారంటూ మహబూబ్​నగర్ ​ఇన్​చార్జి డీఈవో రవీందర్​కొద్దిరోజుల కిందట స్కూల్​ను విజిట్​చేశారు.

మెయిన్​గేట్​ ఎంట్రెన్స్​లో ఉన్న ఉర్దూ మీడియంకు చెందిన థర్డ్, ఫోర్త్​క్లాస్​రూమ్​లను బస్తీ దవాఖానకు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒక క్లాసును స్టోర్​రూమ్​లో, మరో క్లాసును హైస్కూల్​కు మార్చాలని సూచించారు. బస్తీ దవాఖాన కోసం ప్రస్తుతం రూ. 9 లక్షలతో పనులు చేపట్టారు. క్లాస్​రూమ్స్​ను బస్తీ దవాఖానాకు కేటాయించాలని తాము తీర్మానం చేయలేదని, తమకు చెప్పకుండానే కేటాయించారని ఎస్​ఎంసీ చైర్మన్​ షఫీ చెప్పారు. స్కూల్​లో దవాఖానా ఎలా పెడతారని అన్నారు. పిల్లలకు రోగాలు వ్యాపిస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. దవాఖానను వేరోచోటికి మార్చాలని కోరారు.