పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఖానాపూర్, వెలుగు: పాత ఎల్లాపూర్ జెడ్పీ హైస్కూల్ కు చెందిన 2003 బ్యాచ్​పదోతరగతి విద్యార్థులు శనివారం తమ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. 22 ఏళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులను కలుసుకోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని, తరగతి గదిలో చేసిన అల్లరిని గుర్తు చేసుకొని, నవ్వుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. రోజంతా సందడి చేశారు.