రాజకీయాల్లో ఒంటరిపక్షులు ఎక్కువయ్యాయి.పొలిటికల్ లైఫ్ కు ఫ్యామిలీ లైఫ్ కు పొంతన కుదరదంటున్నారు చాలా మంది పొలిటీషియన్లు. రాజకీయాలంటేనే ఆరోపణలు, ప్రత్యారోపణలు కామన్.పెళ్లికి దూరంగా ఉన్న వారిపై సహజంగా ఆరోపణలు తక్కువగా ఉంటాయి. ఎవరైనా అవినీతి ఆరోపణలు చేసినా ‘ నాకు కుటుంబమే లేదు. అవినీతితో సంపాదించాల్సిన అవసరం నాకేంటి ? ’అంటూ ఎదురు ప్రశ్న వేసి రాజకీయ ప్రత్యర్ థుల నోళ్లు మూయిం చవచ్చు.
రాహుల్ గాంధీ :
లోక్ సభ ఎన్నికల్లో యూపీఏ కూటమి గెలిస్తే ప్రధాని పదవి చేపట్టే అవకాశాలున్న కాం గ్రెస్ చీఫ్ రాహుల్ గాం ధీ అవివాహితుడే ఫిఫ్టీస్ లో ఉన్న రాహుల్ను ప్రెస్ కాన్ఫరెన్సుల్లో కొంతమంది సరదాగా ‘ మీ పెళ్లెప్పుడు ఎప్పుడు ’ ? అని ఆయనను అడిగితే చిరునవ్వు నవ్వి జీవితంలో పెళ్లికి మించిన ఇంపార్టెంట్ పనులున్నాయని బదులిస్తుంటారు.
మమతా బెనర్జీ :
రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అవివాహితురాలే. సీఎం పోస్టులో కొనసాగుతున్నా చాలా నిరాడంబర జీవితం గడుపుతుంటారు. వైట్ కలర్ సాదా సీదా చీర, భుజానికి వేలాడే ఓబ్యాగ్ సిం పుల్ బ్యాగ్….ఇదే మమత ఆహార్యం . ఎక్కడకు వెళ్లినా ఇదే డ్రస్లో నిపిస్తుంటారు. తాను రాసిన పుస్తకాలపై వచ్చే రాయల్టీయే బతకడానికి ఆధారం అంటారు మమతా బెనర్జీ.
నవీన్ పట్నాయక్ :
ఒడిషా సర్కార్ కు నాయకత్వం వహిస్తున్న నవీన్ పట్నాయక్ కూడా పెళ్లికి దూరంగా ఉన్నారు. 1946 లో కటక్ లో పుట్టారు. తండ్రి బిజూ పట్నాయక్ నుంచి రాజకీయాల్లోకి వారసత్వంగా వచ్చాడు. ఒడిషాకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో బీజేడీ గెలిస్తే ఐదోసారి సీఎం అయి చరిత్ర సృష్టిస్తారు. ఒడిషా రాజకీయాల్లో ‘ మిస్టర్ క్లీన్ ’గా పేరు తెచ్చుకున్నారు.
సర్బానంద సోనోవాల్ :
అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కూడా పెళ్లి చేసుకోలేదు. ఈశాన్య రాష్ట్రా ల్లో తొలిసారి బీజేపీ సర్కార్ కు సోనోవాల్ నాయకత్వం వహిస్తున్నారు. సోనోవాల్ స్టూ డెంట్ లీడర్ గా జీవితాన్ని ప్రారంభించారు. 1992 నుంచి 1999 వరకు ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ ( ఆసు) ప్రెసిడెంట్ గా పనిచేశారు. అసోం గణపరిషత్ తో పాలిటిక్స్ లోకి ప్రవేశించారు. తర్వాత బీజేపీలోకి చేరారు. 2016 లో అసోం అసెంబ్లీ ఎన్నికల్లో మజౌలి సెగ్మెంట్ నుంచి ఎన్నికయ్యారు. అదే ఏడాది మేలో అసోంకు 14వ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
మనోహర్ లాల్ ఖట్టర్ :
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఈ జాబితాలోకి వస్తారు. ఖట్టర్, ఆరెస్సస్ ప్రచారక్ గా 14 ఏళ్లు పనిచేశారు. అప్పటి నుంచే ఆయనకు నరేంద్ర మోడీతో పరిచయాలున్నాయి. 1994లో బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. హర్యానాలో హర్యానాలో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేశారు. 2014 లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, జయలలిత కూడా పెళ్లి చేసుకోలేదు.
మాయావతి :
ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి దళిత మహిళగా చరిత్ర సృష్టించిన మాయావతి కూడా పెళ్లికి దూరంగానే ఉన్నారు. ఢిల్లీలో టీచర్ గా పనిచేసినప్పుడు అట్టడుగువర్గాలను ఒకే వేదిక మీదకు తీసుకు రావడానికి కృషి చేసిన కాన్షీరాంతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే ఆమెను రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. కాన్షీరాం చనిపోయిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పగ్గా లు చేతుల్లోకి తీసుకున్నారు. బీఎస్పీ చీఫ్ గా ఉన్న మాయావతి కొంతకాలం యూపీకి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ప్రజలకు సేవ చేయడానికే తాను పెళ్లి చేసుకోలేదని తాజాగా విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో మాయావతి పేర్కొన్నారు.
జయలలిత :
అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ సత్తా చాటిన జయలలిత కూడా అవివాహితురాలు. పాలిటిక్స్ లోకి రాకముందు అన్ని దక్షిణాది భాషల్లో కలిపి 140 సిన్మాల్లో నటించారు. అన్నా డీఎంకే అధినేత ఎంజీ రామచంద్రన్ చనిపోయిన తర్వాత ఆ పార్టీ పగ్గా లు చేపట్టారు. పార్టీని ఒంటిచేత్తో నడిపించారు1984 నుం చి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యు రాలిగా ఎన్నికయ్యారు.జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడుకు ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి జయలలితే. కొంతకాలం అస్వస్థతతో బాధపడ్డ జయలలిత 2016 డిసెంబర్ 5న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చనిపోయారు. వీరే కాదు రాజకీయ రంగానికి చెందిన మరికొందరు ప్రముఖులు కూడా పెళ్లికి దూరంగా ఉన్నారు.
ఉమాభారతి :
రామజన్మభూమి వివాదం దేశాన్ని ఊపేసిన రోజుల్లో ఉమాభారతి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు.1984 లో బీజేపీలో లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 1989లో ఖజురాహో సెగ్మెంట్ నుంచి పోటీ చేసి గెలిచారు. 1999 లో భోపాల్ నియోజకవర్గం నుంచి గెలిచి కేంద్రంలోని ఏబీ వాజ్ పేయి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2003 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలుపు తీరాలకు చేర్చడంలో ఆమె కీలకపాత్ర పోషిం చారు. అదే ఏడాది అమె మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2004 లో ఆమె సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత భారతీయ జనశక్తి పేరుతో కొత్త పార్టీ పెట్టారు. 2011లో ఆమె తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు.
అబ్డు ల్ కలాం :
దేశానికి 11వ రాష్ట్రపతిగా పనిచేసిన ఏపీజే అబ్దు ల్ కలాం బ్రహ్మచారే. తమిళనాడులోని రామేశ్వరం ఆయన సొంతూరు.చెన్నైలో ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చదివారు.‘ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ’( డీఆర్ డీఓ) తో పాటు ‘ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ’(ఇస్రో) లో సైంటిస్టు గా కీలక బాధ్యతల్లో పనిచేశారు. ‘ మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ’ గా పేరు తెచ్చుకున్నారు.1998లో జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షల్లోమేజర్ రోల్ అబ్దు ల్ కలాందే. 2002 లో రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు. రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించారు.
యోగి ఆదిత్యనాథ్
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ కూడా అవివాహితుల జాబితాలో ఉన్నారు. చిన్నప్పటి నుంచి హిందూత్వ సిద్ధాంతాల వైపుఆకర్షితులయ్యారు. 1998లో తొలిసారి గోరఖ్ పూర్ నుంచి ఆయన లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు ఆయన లోక్ సభకు ఎన్నికయ్యారు. 2017 లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.