- కూలిన బాత్ రూమ్ సీలింగ్
- ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట కలెక్టరేట్ లో బాత్ రూమ్ సీలింగ్ కూలింది. ఆఫీసు రెండో అంతస్తులో మహిళల బాత్రూంల వద్ద ఉదయం పెద్ద సైజులో స్లాబ్ సీలింగ్ భారీ శబ్దంతో ఊడి పడింది. ఆఫీస్ పని వేళలు ప్రారంభంకాకపోవడం, ఎవరూ రాకపోవడంతో ప్రమాదం తప్పింది. కలెక్టరేట్ ను రూ. 50 కోట్లతో ఏడేండ్ల పాటు కట్టగా, మాజీ సీఎం కేసీఆర్ గత ఏడాది ఆగస్టులో ప్రారంభించారు.
ఓపెన్చేసినప్పటి నుంచి లీకేజీలు, స్లాబ్ నుంచి వర్షపు నీరు కారడం, సీలింగులు ఊడి పడడం, గోడలకు నిమ్ము రావడంతో పాటు తాజా ఘటనతో నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి. ఏడాదిలోనే ఇంత జరిగితే భవిష్యత్లో ఇంకేమవుతుందోనని కార్యాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.