
వర్ధన్నపేట, వెలుగు: రిపేర్ల పేరుతో స్కూల్లో బాత్రూమ్లకు తాళం వేయడంతో తాత్కాలికంగా బతుకమ్మ చీరలను అడ్డుగా కట్టి వినియోగించుకుంటున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో మన ఊరు మన బడి కింద పనులు చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు. స్కూల్లో ఉన్న బాత్రూమ్లకు రిపేర్లు చేస్తామని తాళాలు వేశారు. దీంతో పంచాయతీ సిబ్బంది తాత్కాలికంగా స్టూడెంట్లు వినియోగించుకునేందుకు బతుకమ్మ చీరలను అడ్డుగా కట్టారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ పనులను పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.