గ్రేటర్ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు, దేవీ నవరాత్రుల ఉత్సవాలు

గ్రేటర్ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు, దేవీ నవరాత్రుల ఉత్సవాలు

గ్రేటర్ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు, దేవీ నవరాత్రుల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గాంధీ హాస్పిటల్​లోని ఐసీటీసీ(ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ టెస్టింగ్ సెంటర్---) విభాగంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. హెచ్​వోడీ ప్రొఫెసర్ ఎస్. రాజేశ్వర్ రావు, ప్రొఫెసర్ నాగమణి, అసోసియేట్లు డాక్టర్ నవనీత, డాక్టర్ పూజ, అసిస్టెంట్ డాక్టర్ అర్చన, టెక్నికల్ ఆఫీసర్ శివన్న పాల్గొన్నారు. దసరా పండుగను సంబురంగా జరుపుకోవాలని బీజేపీ శేరిలింగంపల్లి సెగ్మెంట్ ఇన్​చార్జి యోగానంద్ అన్నారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా శేరిలింగంపల్లి, బతుకమ్మ కుంట, తారానగర్​లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను శనివారం ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట రంగారెడ్డి అర్బన్​ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి, నాయకులు ఉన్నారు. గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్​ సెంటర్​లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న మహిళా పోలీసులు, సిబ్బంది బతుకమ్మ ఆడారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర,  అదికారులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అంబర్ పేటలోని సిటీ ఆర్మ్​డ్ హెడ్ క్వార్టర్స్ లో రాచకొండ కమిషనరేట్​కు చెందిన మహిళా పోలీసులు, సిబ్బంది బతుకమ్మ ఆడారు. మరోవైపు సిటీలో దసరా జోష్ పెరిగింది. దాండియా నైట్ ఈవెంట్లకు యువత ఆసక్తి చూపిస్తున్నారు. గర్బా డ్యాన్స్, దాండియా ఈవెంట్లలోనే యువత ఎక్కువగా కనిపిస్తున్నారు. సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు ఈ ప్రోగ్రామ్​లు జరుగుతున్నాయి.  

- వెలుగు, హైదరాబాద్/పద్మారావునగర్/గచ్చిబౌలి/నేరెడ్ మెట్/ఎల్​బీనగర్/శంషాబాద్