స్కాట్లాండ్​లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

స్కాట్లాండ్​లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

గ్లాస్గో: ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబురాలను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో స్థానిక తెలుగు సంఘం ఆధ్వర్యంలో శనివారం తెలుగు కమ్యూనిటీ ప్రజలు బతుకమ్మ పండుగను భారీ ఎత్తున నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మలను చేసి భక్తి శ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా మహిళలు ఆట, పాటలతో అందరిని అలరించారు. తెలంగాణ పల్లెలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పూల పండుగను నిర్వహిస్తుండటంతో ఈ తరం పిల్లలకు బతుకమ్మ విశిష్టత తెలుస్తుందని డాక్టర్ పునీత్ బేడీ, రష్మీ నాయక్, డాక్టర్ మమత వుసికెల, వినీల బత్తుల తెలిపారు.