సిరిసిల్ల జగిత్యాల స్కూళ్లలో బతుకమ్మ సంబురాలు 

సిరిసిల్ల టౌన్, జగిత్యాల టౌన్, వెలుగు : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేట్​స్కూళ్లలో ముందస్తు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని మాస్టర్​మైండ్స్‌‌‌‌, ఇంగ్లీష్​యూనియన్ స్కూళ్లలో విద్యార్థులు బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు.  శ్రీకృష్ణవేణి టాలెంట్​స్కూల్‌‌‌‌లో నిర్వహించిన సంబురాల్లో మున్సిపల్​చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్​జిందం కళా పాల్గొన్నారు. కార్యక్రమంలో  వార్డ్ కౌన్సిలర్ నేరెళ్ల శైలజ, ప్రిన్సిపాల్ రాజిరెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల లోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ,  సూర్య గ్లోబల్ స్కూల్‌‌‌‌లో సంబరాల్లో డైరెక్టర్ హరిచరణ్ రావు, డైరెక్టర్లు శ్రీధర్ రావు, మౌనిక రావు, అజిత, పాల్గొన్నారు.

సిటీలో బతుకమ్మ సంబరాలు

కరీంనగర్ టౌన్, కొత్తపల్లి : సిటీలోని ఆర్విన్ ట్రీ,వసంత్  వ్యాలీ స్కూళ్లలో గురువారం  ఘనంగా  బతుకమ్మ సంబరాలు జరిగాయి.  ఆర్విన్ ట్రీ స్కూల్ చైర్మన్ బి.రమణారావు,డైరెక్టర్ విజయలక్ష్మి  ఆధ్వర్యంలో ఆటపాటలతో సంబరాలు నిర్వహించారు. హనుమాన్ నగర్ లోని వసంత్ వ్యాలీ స్కూల్‌‌‌‌లో కరస్పాండెంట్ ఎ.స్వరూప బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.  రేకుర్తి పారడైజ్ స్కూల్‌‌‌‌లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ సీఈవో ఉమాకాంత్, ప్రిన్సిపాల్ టి.వసంత, వైస్ ప్రిన్సిపాల్​ఎ.మధు, ఎ.మధు, ఏ‌‌‌‌వో కె.శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.