భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం/ఖమ్మం రూరల్, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, కొత్తగూడెంలోని హేమచంద్రపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. బతుకమ్మ గొప్పతనాన్ని వివరించి పూజలు చేశారు. మహిళలు బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ సందడి చేశారు.
మేధా ఉమెన్ ఇంజినీరింగ్ కాలేజీలో...
ఖమ్మం రూరల్ మండలంలోని మేధా ఉమెన్ ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. కాలేజీ చైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు మాట్లాడుతూ బతుకమ్మఘనంగా బతుకమ్మ సంబరాలు తెలంగాణ అస్తిత్వం అన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బి గోపాల్ మాట్లాడుతూ మేధా కళాశాల సాంస్కృతిక వైవిధ్యం, తెలంగాణ సంప్రదాయాలను పాటించటంలో ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మేధా సంస్థల ప్రెసిడెంట్ కటేపల్లి అప్పారావు, మేదా పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాదినేని రంగారావు, కళాశాల అకాడమిక్ డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ, లెక్చరర్లు, స్టూడెంట్స్
పాల్గొన్నారు.