
వరంగల్ సిటీ/కొత్తగూడ,(గంగారం), వెలుగు : కాశిబుగ్గ ఓ సిటీలో శనివారం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయుకుడు, వరంగల్ అర్భన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు క్యాంపు కార్యాలయంలో ప్రదీప్ రావు సతీమణి ఎర్రబెల్లి రేణుక ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడారు. మహబూబాబాద్ జిల్లా గంగారం పీహెచ్సీలో డాక్టర్ ప్రత్యూష ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.