
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు షురూ అయ్యాయి. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పట్టణాలు, గ్రామాల్లో మహిళలు తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను పేర్చారు.“బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో” అంటూ పాటలు పాడుతూ ఆలయాలు, చౌరస్తాల వద్ద సంబరాలు నిర్వహించారు. అనంతరం చెరువులు, కుంటల వద్ద నిమజ్జనం చేసి ప్రసాదాలను స్వీకరించారు. - న్యూస్నెట్ వర్క్, వెలుగు