
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను మంగళవారం ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి స్టూడెంట్స్, గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ఆడిపాడారు. బతుకమ్మ పండుగ గురించి స్టూడెంట్స్కు టీచర్లు వివరించారు. ఖమ్మంలోని స్మార్ట్ కిడ్జ్స్కూల్లో నిర్వహించిన వేడుకలు ఆకట్టుకున్నాయి. – నెట్వర్క్ , వెలుగు