నల్గొండ జిల్లా కేంద్రంలో బుధవారం ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టులో జడ్జి నాగరాజు సంబురాలను ప్రారంభించారు. ఆర్డీవో కార్యాలయంలో నల్గొండ డివిజన్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది, ఐసిడిఎస్, విద్యుత్ శాఖా, మున్సిపాలిటీ, మెప్మా, డీఆర్డీఎ సిబ్బంది బతుకమ్మ ఆడారు. ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు, ఎన్జీ కళాశాలో అడిషనల్ కలెక్టర్లు జె శ్రీనివాస, పి పూర్ణచంద్ర పాల్గొన్నారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, నల్గొండ