గ్రేటర్లో బుధవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రాజ్భవన్లో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారితో కలిసి గవర్నర్ సతీమణి సుధదేవ్వర్మ బతుకమ్మ ఆడారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో నిర్వహించిన సంబురాల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, మహిళా కార్పొరేటర్లు పాల్గొన్నారు.
హైదరాబాద్ కలెక్టరేట్లో అధికారులతో కలిసి కలెక్టర్ అనుదీప్ బతుకమ్మ ఆడారు. అంబర్పేటలో నిర్వహించిన సంబురాల్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సతీమణి కావ్య రెడ్డి పాల్గొన్నారు. అలాగే గాంధీ హాస్పిటల్, కన్జ్యూమర్ఫోరం ఆఫీసులో బతుకమ్మ వేడుకలు సందడిగా సాగాయి.
సిటీ నెట్వర్క్, వెలుగు