ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో గురువారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నుంచి దసరా సెలవులు కావడంతో ముందస్తు వేడుకలు జరిపారు. టీచర్లు, స్టూడెంట్లు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాల్స్ బతుకమ్మ
దసరా పండుగల విశిష్టతను స్టూడెంట్లకు వివరించారు. ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని రెజొనెన్స్ స్కూల్లో నిర్వహించిన పూల పండుగలో మేయర్పూనుకొల్లు నీరజ పాల్గొని టీచర్లు, స్టూడెంట్లతో బతుకమ్మ ఆడారు. ఉత్సవాల్లో ప్రిన్సిపాల్ ఎం.ప్రసన్నరావు, టీచర్లు పాల్గొన్నారు.