
సిద్దిపేట రూరల్, వెలుగు : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం కలెక్టర్ ఆఫీస్లో బతుకమ్మ పండుగ నిర్వహించారు. మహిళా ఉద్యోగులు వివిధ రూపాల్లో పేర్చిన బతుకమ్మలతో వచ్చి ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమ అగ్రవాల్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దంపతులు, సీపీ శ్వేత, డీఆర్ఓ నాగరాజమ్మ, డీపీఓ దేవకీదేవి, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సరోజ, ఏవో అబ్దుల్ రహమాన్ పాల్గొన్నారు.
మెదక్ టౌన్ : జిల్లా కలెక్టరేట్ఆవరణలో బతుకమ్మ సందడి నెలకొంది. మహిళా ఉద్యోగులు, అధికారులు బతుకమ్మలతో తరలివచ్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, జిల్లా సంక్షేమాధికారి బ్రహ్మాజీ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మెప్మా పీడీ ఇందిర, స్వయం సహాయక సంఘ సభ్యులు, మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.