గ్లోబల్ రెయిన్ లో బతుకమ్మ సంబురం

కూసుమంచి,వెలుగు: మండల కేంద్రంలోని గ్లోబల్  రెయిన్  స్కూల్​లో శనివారం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. స్కూల్ పూలవనంలా మారింది.  చిన్నారులుతీరొక్క పూలతో అందమైన బతుకమ్మలను పేర్చారు. విద్యార్థులు కూసుమంచి సెంటర్ లో కోలాటాలు ఆడారు.

విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి సందడి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్న మోహన్, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, స్కూల్​ కరస్పాండెంట్  ఎర్షాద్ అహ్మద్,  అకడమిక్ డైరెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ,  జాహ్నవి, పాపారావు, టీచర్స్​, స్టూడెంట్స్,పేరెంట్స్​ తదిరతులు పాల్గొన్నారు