రాజ్​భవన్​ గవర్నమెంట్ స్కూలులో సందడిగా బతుకమ్మ సంబురాలు

రాజ్​భవన్​ గవర్నమెంట్ స్కూలులో సందడిగా బతుకమ్మ సంబురాలు

ఖైరతాబాద్/వికారాబాద్/కూకట్​పల్లి,వెలుగు: రాజ్​భవన్​ గవర్నమెంట్ స్కూలులో మంగళవారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. టీచర్లు కరుణశ్రీ, పుష్పలత, స్టూడెంట్లతో కలిసి బతుకమ్మను పేర్చారు. ఆవరణలో ఆటపాటలతో సందడి చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బృంగీ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థల కార్యదర్శి ప్రమీల చంద్రశేఖర్ ఉపాధ్యాయులు, విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు. కూకట్​పల్లిలో జోరు వానలోనూ రెండో రోజు బతుకమ్మ సంబురాలు కొనసాగాయి.