ఘనంగా బతుకమ్మ సంబురం

ఘనంగా బతుకమ్మ సంబురం

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా శుక్రవారం బాగ్​లింగంపల్లిలోని కాకా డాక్టర్​బీఆర్​ అంబేద్కర్​ కాలేజీలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. తీరొక్క పూలతో భారీ బతుకమ్మ పేర్చి ప్రత్యేక పూజలు చేశారు. స్టూడెంట్లతో కలిసి కాలేజీ స్టాఫ్ ​ఆడిపాడారు. సంప్రదాయ నృత్యాలతో హోరెత్తించారు. ప్లే బ్లాక్ సింగర్, యాక్టర్ ​శ్రీరామచంద్ర పాల్గొని పాటలతో సందడి చేశారు. వేడుకల్లో విద్యాసంస్థల సెక్రటరీ వినోద్, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు పాల్గొన్నారు. అలాగే హెచ్ఎంటీ ఆఫీసర్స్​కాలనీలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాదాపూర్​శిల్పారామంలో శుక్రవారం ఆల్ ఇండియా సారీ మేళాతోపాటు బతుకమ్మ, దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.