బషీర్‌బాగ్/గండిపేట/రంగారెడ్డి కలెక్టరేట్/వికారాబాద్, వెలుగు : గ్రేటర్ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. మంగళవారం సిటీలోని ప్రభుత్వ ఆఫీసుల్లో బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. హిమాయత్నగర్పంచాయతీరాజ్ కమిషనరేట్, నాంపల్లిలోని టీజీఓ ఆఫీసుల్లో నిర్వహించిన సంబురాల్లో మంత్రి సీతక్క పాల్గొని మహిళా ఉద్యోగులతో బతుకమ్మ ఆడారు. పోలీస్ అకాడమీ, నాంపల్లి క్రిమినల్ కోర్టులో, డీజీపీ ఆఫీసులో, టీఎన్జీఓ, ఎక్సైజ్ ఆఫీసుల్లో, ఇందిరా పార్కులో, కొంగరకలాన్ లోని రంగారెడ్డి కలెక్టరేట్, వికారాబాద్‌లోని కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులు బతుకమ్మలు పేర్చి, ఒక్కచోట చేరి ఆడిపాడారు.