బతుకమ్మ పాటలు తెలుగు లిరిక్స్

ఒక్కేసి పువ్వేసి చందమామా...     ఒక్క జాము ఆయె చందమామా
పైన మఠం కట్టి చందమామా...     కింద ఇల్లు కట్టి చందమామా 
మఠంలో ఉన్న చందమామా...     మాయదారి శివుడు చందమామా 
శివపూజ వేళాయె చందమామా...     శివుడు రాకపాయె చందమామా 
గౌరి గద్దెల మీద చందమామా...     జంగమయ్య ఉన్నాడె చందమామా  
రెండేసి పూలేసి చందమామా...     రెండు జాములాయె చందమామా 
శివపూజ వేళాయె చందమామా...     శివుడు రాకపాయె చందమామా 
మూడేసి పూలేసి చందమామా...     మూడు జాములాయె చందమామా 
శివపూజ వేళాయె చందమామా...     శివుడు రాకపాయె చందమామా 
నాలుగేసి పూలేసి చందమామా...     నాలుగు జాములాయె చందమామా 
శివపూజ వేళాయె చందమామా...    శివుడు రాకపాయె చందమామా 
ఐదేసి పూలేసి చందమామా...    ఐదు జాములాయె చందమామా 
శివపూజ వేళాయె చందమామా...    శివుడు రాకపాయె చందమామా 
ఆరేసి పూలేసి చందమామా...    ఆరు జాములాయె చందమామా 
శివపూజ వేళాయె చందమామా...    శివుడు రాకపాయె చందమామా 
ఏడేసి పూలేసి చందమామా...     ఏడు జాములాయె చందమామా 
శివపూజ వేళాయె చందమామా...     శివుడు రాకపాయె చందమామా 
ఎనిమిదేసి పూలేసి చందమామా...     ఎనిమిది జాములాయె చందమామా 
శివపూజ వేళాయె చందమామా...    శివుడు రాకపాయె చందమామా 
తొమ్మిదేసి పూలేసి చందమామా...     తొమ్మిది జాములాయె చందమామా 
శివపూజ వేళాయె చందమామా...    శివుడు రాకపాయె చందమామా 
తంగేడు వనములకు చందమామా...    తాళ్ళు కట్టాబోయె చందమామా 
గుమ్మాడి వనమునకు చందమామా...    గుళ్ళు కట్టాబోయె చందమామా 
రుద్రాక్ష వనములకు చందమామా...    నిద్ర చేయబాయె చందమామా

ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో..ఒక్కఊరికిస్తె ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో..ఒచ్చెన పొయెన ఉయ్యాలో
ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో..ఏరడ్డమాయె ఉయ్యాలో
ఏరుకు ఎంపల్లె ఉయ్యాలో..తలుపులడ్డమాయె ఉయ్యాలో
తలుపు తాళాలు ఉయ్యాలో..వెండివే చీలలు ఉయ్యాలో
వెండి చీలకింది ఉయ్యాలో..వెలపత్తి చెట్టు ఉయ్యాలో
వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో..ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో
ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో..తక్కెడెపత్తి ఉయ్యాలో
ఏడుగింజల పత్తి ఉయ్యాలో..ఎళ్లెనె ఆపత్తి ఉయ్యాలో
ఆప్తి తీసుకొని ఉయ్యాలో..ఏడికిపొయిరి ఉయ్యాలో
పాల పాలపత్తి ఉయ్యాలో..పావురాయి పత్తి ఉయ్యాలో
పాల పాలపత్తి ఉయ్యాలో..బంగారు పత్తి ఉయ్యాలో..!!

ఊరికి ఉత్తరానా.. వలలో
ఊరికి ఉత్తరానా ... వలలో
ఊడాలా మర్రీ ... వలలో
ఊడల మర్రి కిందా ... వలలో
ఉత్తముడీ చవికే ... వలలో
ఉత్తముని చవికేలో ... వలలో
రత్నాల పందీరీ ... వలలో
రత్తాల పందిట్లో ... వలలో
ముత్యాలా కొలిమీ ... వలలో
గిద్దెడు ముత్యాలా ... వలలో
గిలకాలా కొలిమీ ... వలలో
అరసోల ముత్యాలా ... వలలో
అమరీనా కొలిమీ ... వలలో
సోలెడు ముత్యాలా ... వలలో
చోద్యంపూ కొలిమీ ... వలలో
తూమెడు ముత్యాలా ... వలలో
తూగేనే కొలిమీ ... వలలో
చద్దన్నమూ తీనీ ... వలలో
సాగించూ కొలిమీ ... వలలో
పాలన్నము తీనీ ... వలలో
పట్టేనే కొలిమీ ... వలలో

బతుకమ్మను పేర్చే పాట

తొమ్మిదీ రోజులు ఉయ్యాలో 
నమ్మికా తోడుత ఉయ్యాలో 
అలరి గుమ్మడి పూలు ఉయ్యాలో
అరుగులూ వేయించిరి ఉయ్యాలో 
గోరంట పూలతో ఉయ్యాలో 
గోడలు కట్టించి ఉయ్యాలో 
తామరపూలతో ఉయ్యాలో 
ద్వారాలు వేయించి ఉయ్యాలో 
మొగిలి పూలతోని ఉయ్యాలో 
మొగరాలు వేయించి ఉయ్యాలో 
వాయిలీ పూలతో ఉయ్యాలో 
వాసాలు వేయించి ఉయ్యాలో 
పొన్నపూలతోటి ఉయ్యాలో
యిల్లనూ కప్పించి ఉయ్యాలో 
దోసపూలతోని ఉయ్యాలో 
తోరణాలు కట్టించి ఉయ్యాలో 
పసుపుముద్దను చేసి ఉయ్యాలో 
గౌరమ్మను నిలిపిరి ఉయ్యాలో 
చేమంతి పూలతోని ఉయ్యాలో 
చెలియను పూజించిర ఉయ్యాలో 
సుందరాంగులెల్ల ఉయ్యాలో 
సుట్టూత తిరిగిరి ఉయ్యాలో 
ఆటలు ఆడిరి ఉయ్యాలో 
పాటలు పాడిరి ఉయ్యాలో
గౌరమ్మ వరమిచ్చె ఉయ్యాలో
కాంతాలందరికి ఉయ్యాలో 
పాడినా వారికి ఉయ్యాలో 
పాడి పంటలు కల్గు ఉయ్యాలో 
ఆడినా వారికి ఉయ్యాలో
ఆరోగ్యము కల్గు ఉయ్యాలో 
విన్నట్టి వారికి ఉయ్యాలో 
విష్ణుపథము కల్గు ఉయ్యాలో

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ...
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ 
గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ...
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ 
గుమ్మాడి చెట్టుకింద గౌరమ్మ...
ఆట చిలుకాలార గౌరమ్మ 
పాట చిలుకాలార గౌరమ్మ...
బమ్మశ్రీమాడలూ గౌరమ్మ 
కందొమ్మ గడ్డలూ గౌరమ్మ...
ఎనుగూల కట్టెలూ గౌరమ్మ  
తారు గోరంటాలు గౌరమ్మ...
ఎర్రొద్దురాక్షలు గౌరమ్మ 
పోను తంగేడుపూలు గౌరమ్మ...
రాను తంగేడుపూలు గౌరమ్మ 
ఘనమైన పొన్నపూలే గౌరమ్మ...
గజ్జాల వడ్డాణమే గౌరమ్మ 
తంగేడు చెట్టుకింద గౌరమ్మ...
ఆట చిలుకాలార గౌరమ్మ 
పాట చిలుకాలార గౌరమ్మ...
బమ్మశ్రీమాడలూ గౌరమ్మ 
కందొమ్మ గడ్డలు ఎనుగూల కట్టెలు గౌరమ్మ
తారు గోరంటాలు ఎర్రొద్దురాక్షలు
పోను తంగేడుపూలురాను తంగేడుపూలు
ఘనమైన పొన్నపూలేగజ్జాల వడ్డాణమే
కాకర చెట్టుకింద ఆట చిలుకాలార 
పాట చిలుకాలార బమ్మశ్రీమడలూ 
తారు గోరంటాలు ఎర్రొద్దురాక్షలు 
పోను తంగేడుపూలురాను తంగేడుపూలు 
ఘనమైన పొన్నపూలే గజ్జాల వడ్డాణమే 
రుద్రాక్ష చెట్టుకింద ఆట చిలుకాలార 
పాట చిలుకాలార కలికి చిలుకాలార 
కందొమ్మ గడ్డలూ బమ్మశ్రీమాడలూ 
తారు గోరంటాలు తీరు గోరంటాలు 
ఎనుగూల కట్టె ఎర్రొద్దురాక్షలు 
రాను తంగెడు పువ్వు పోను తంగెడు పువ్వు 
ఘనమైన పొన్నపూలే గజ్జాల వడ్డాణమే 
ఆ పూలు తెప్పించి పొందుగా పేరిచి 
గంధములు పూయించి పసుపు కుంకుమలు పెట్టి 
నీ నోము నీకిత్తునే గౌరమ్మ
నా నోము నాకియ్యవే గౌరమ్మ

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ...
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ 
గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ...
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ 
గుమ్మాడి చెట్టుకింద గౌరమ్మ...
ఆట చిలుకాలార గౌరమ్మ 
పాట చిలుకాలార గౌరమ్మ...
బమ్మశ్రీమాడలూ గౌరమ్మ 
కందొమ్మ గడ్డలూ గౌరమ్మ...
ఎనుగూల కట్టెలూ గౌరమ్మ  
తారు గోరంటాలు గౌరమ్మ...
ఎర్రొద్దురాక్షలు గౌరమ్మ 
పోను తంగేడుపూలు గౌరమ్మ...
రాను తంగేడుపూలు గౌరమ్మ 
ఘనమైన పొన్నపూలే గౌరమ్మ...
గజ్జాల వడ్డాణమే గౌరమ్మ 
తంగేడు చెట్టుకింద గౌరమ్మ...
ఆట చిలుకాలార గౌరమ్మ 
పాట చిలుకాలార గౌరమ్మ...
బమ్మశ్రీమాడలూ గౌరమ్మ 
కందొమ్మ గడ్డలు ఎనుగూల కట్టెలు గౌరమ్మ
తారు గోరంటాలు ఎర్రొద్దురాక్షలు
పోను తంగేడుపూలురాను తంగేడుపూలు
ఘనమైన పొన్నపూలేగజ్జాల వడ్డాణమే
కాకర చెట్టుకింద ఆట చిలుకాలార 
పాట చిలుకాలార బమ్మశ్రీమడలూ 
తారు గోరంటాలు ఎర్రొద్దురాక్షలు 
పోను తంగేడుపూలురాను తంగేడుపూలు 
ఘనమైన పొన్నపూలే గజ్జాల వడ్డాణమే 
రుద్రాక్ష చెట్టుకింద ఆట చిలుకాలార 
పాట చిలుకాలార కలికి చిలుకాలార 
కందొమ్మ గడ్డలూ బమ్మశ్రీమాడలూ 
తారు గోరంటాలు తీరు గోరంటాలు 
ఎనుగూల కట్టె ఎర్రొద్దురాక్షలు 
రాను తంగెడు పువ్వు పోను తంగెడు పువ్వు 
ఘనమైన పొన్నపూలే గజ్జాల వడ్డాణమే 
ఆ పూలు తెప్పించి పొందుగా పేరిచి 
గంధములు పూయించి పసుపు కుంకుమలు పెట్టి 
నీ నోము నీకిత్తునే గౌరమ్మ
నా నోము నాకియ్యవే గౌరమ్మ

సాగనంపే పాట 

తంగేడు పూవుల్ల చందమామ...     బతుకమ్మ పోతుంది చందమామ 
పోతె పోతివిగాని చందమామ...     మల్లెన్నడొస్తావు చందమామ 
యాడాదికోసారి చందమామ...     నువ్వొచ్చిపోవమ్మ చందమామ 
బీరాయి పూవుల్ల చందమామ...     బతుకమ్మ పోతుంది చందమామ 
పోతె పోతివిగాని చందమామ...     మల్లెన్నడొస్తావు చందమామ 
యాడాదికోసారి చందమామ...     నువ్వొచ్చి పోవమ్మచందమామ 
గునిగీయ పూవుల్ల చందమామ...     బతుకమ్మ పోతుంది చందమామ 
పోతే పోతివిగాని చందమామ...     మల్లెన్నడొస్తావు చందమామ 
యాడాదికోపారి చందమామ...     నువ్వొచ్చిపోవమ్మ చందమామ 
కాకర పూవుల్ల చందమామ...     బతుకమ్మ పోతుంది చందమామ 
పోతె పోతివిగాని చందమామ...     మల్లెన్నడొస్తావు చందమామ 
యాడాదికోసారి చందమామ...     నువ్వొచ్చి పోవమ్మ చందమామ 
కట్లాయి పూవుల్ల చందమామ...     బతుకమ్మ పోతుంది చందమామ 
పోతె పోతివిగాని చందమామ...     మల్లెన్నడొస్తావు చందమామ 
యాడాదికోసారి చందమామ...     నువ్వొచ్చి పోవమ్మ చందమామ 
రుద్రాక్ష పూవుల్ల చందమామ...     బతుకమ్మ పోతుంది చందమామ  
పోతె పోతివిగాని చందమామ...     మల్లెన్నడొస్తావు చందమామ 
యాడాదికోసారి చందమామ...     నువ్వొచ్చి పోవమ్మ చందమామ 
గుమ్మడి పూవుల్ల చందమామ...     బతుకమ్మ పోతుంది చందమామ  
పోతె పోతివిగాని చందమామ...     మల్లెన్నడొస్తావు చందమామ 
యాడాదికోసారి చందమామ...     నువ్వొచ్చి పోవమ్మ చందమామ 

అన్నలొచ్చిన వేళ 

కలవారి కోడలు ఉయ్యాలో...     కనక మహాలక్ష్మి ఉయ్యాలో 
కడుగుతున్నది పప్పు ఉయ్యాలో...    కడవల్లోనబోసి ఉయ్యాలో 
అప్పుడే వచ్చెను ఉయ్యాలో...    ఆమె పెద్దన్న ఉయ్యాలో 
కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో...    కన్నీళ్లు తీసింది ఉయ్యాలో 
ఎందుకు చెల్లెల్లా ఉయ్యాలో...    ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో 
తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో...    ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో 
ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో ...    వెళ్లి వద్దామమ్మ ఉయ్యాలో 
చేరి నీవారితో ఉయ్యాలో...    చెప్పిరాపోవమ్ము ఉయ్యాలో 
పట్టెమంచం మీద ఉయ్యాలో...    పవళించిన మామ ఉయ్యాలో 
మాయన్నలొచ్చిరి ఉయ్యాలో...     మమ్ముబంపుతార ఉయ్యాలో
 నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో...     మీ అత్తనడుగు ఉయ్యాలో 
అరుగుల్ల గూసున్న ఉయ్యాలో...    ఓ అత్తగారు ఉయ్యాలో 
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో...     మమ్ముబంపుతార ఉయ్యాలో 
 నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో...     మీ బావనడుగు ఉయ్యాలో 
భారతం సదివేటి ఉయ్యాలో...     బావ పెద్ద బావ ఉయ్యాలో 
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో...     మమ్ముబంపుతార ఉయ్యాలో 
 నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో...     మీ అక్కనడుగు ఉయ్యాలో 
వంటశాలలో ఉన్న ఉయ్యాలో...     ఓ అక్కగారు ఉయ్యాలో 
మా అన్నలొచ్చిరి ఉయ్యాలో...     మమ్ముబంపుతార ఉయ్యాలో 
 నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో...     మీ భర్తనే అడుగు ఉయ్యాలో 
రచ్చలో గూర్చున్న ఉయ్యాలో...     రాజేంద్ర భోగి ఉయ్యాలో 
 మా అన్నలొచ్చిరి ఉయ్యాలో...     మమ్ముబంపుతార ఉయ్యాలో 
కట్టుకో చీరలు ఉయ్యాలో...     పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో 
ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో...     వెళ్లిరా ఊరికి ఉయ్యాలో