హైదరాబాద్, వెలుగు: ఆక్వా ప్లంబింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బాత్‌వేర్ బ్రాండ్ ప్లంబర్ బాత్‌వేర్ తమ సరికొత్త ఎక్సోటికా కుళాయిల కలెక్షన్‌ని విడుదల చేసింది. సొగసైన డిజైన్ వల్ల ఇవి అందంగా కనిపిస్తాయని తెలిపింది. బాత్‌రూమ్‌లను, కిచెన్‌లను ఆధునీకరించడానికి నలుపు, రోజ్ గోల్డ్, షాంపైన్ గోల్డ్, తెలుపు వంటి రంగుల్లో ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది.
వీటిని వాడటం సులువని, నీటిని పొదుపు చేస్తాయని తెలిపింది. హ్యాండిల్స్ మృదువుగా ఉంటాయని పేర్కొంది. ప్లంబర్ బాత్‌వేర్ ఎక్సోటికా శ్రేణి కుళాయిల ధరలు రూ. 2,500 నుంచి రూ. లక్ష వరకు ఉంటాయి. అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని కుళాయిలపై జీవితకాల వారంటీని ఇస్తామని కంపెనీ తెలిపింది.