ధర్నా చౌక్ వద్ద బెటాలియన్ పోలీసుల అరెస్ట్

ధర్నా చౌక్ వద్ద బెటాలియన్ పోలీసుల అరెస్ట్

ముషీరాబాద్, వెలుగు: ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ బెటాలియన్ పోలీసులు సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ఆందోళనకు సిద్ధపడగా, పోలీసులు వారిని అరెస్టు చేశారు. బెటాలియన్ పోలీసులు ధర్నా చౌక్ కు భారీగా వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడికి వచ్చిన 21 మందిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా బెటాలియన్ పోలీసులు విజయేందర్, నాగరాజు, సంపత్, గిరిబాబు, రాజు మాట్లాడుతూ.. కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మాదిరిగా ఒకే రాష్ట్ర ఒకే పోలీస్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు.