Battery Electrict Vehicles: ఈ ఏడాది బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల (BEVలు) అమ్మకాలు 10మిలియన్ మార్క్ ను దాటొచ్చని అంచనా వేస్తున్నాయి రీసెర్చ్ సంస్థలు. ఇది ఎలక్టిక్ వాహనాల తయారీలో గ్లోబల్ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌కు గణనీయమైన విజయాన్ని చూపుతుంది. ఉత్పత్తి ప్రక్రియల ఆధునీకరణ, బ్యాటరీ తయారీదారులతో వ్యూహాత్మక భాగస్వామ్యం..ఈ వృద్ధి సులభతరం అవుతుందని మంగళవారం విడుదల చేసిన నివేదిక హైలైట్ చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఖర్చులను తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాలను మరింత సరసమైనవిగా సరఫరా చేయడమే లక్ష్యంగా ఉత్పత్తి ప్రక్రియలు అప్డేట్ చేయబడ్డాయి. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ ఈ నివేదికను రూపొందించింది.
ఎలక్ట్రికల్ వాహనాల సరఫరా పెంచడం, 35వేల డాలర్ల కంటే తక్కువ ధర కలిగిన EV లను ఉత్పత్తి కి సిద్దం చేయడం ద్వారా ఫోర్డ్, GM, స్టెల్లాంటిస్, వోక్స వ్యాగన్ వంటి వాహనాల తయరీదారులు మార్కెట్లో పోటీ పడుతున్నాయి.కార్బన ఉద్గారాలను తగ్గించడం, పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్ లపై పెట్టుబడి పెట్టడం , 2025 చివరి నాటికి ప్రపంచ BEV మార్కెట్ ను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఇదిలావుండగా.. ఓలా ఎలక్ట్రిక్ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) నుండి ఇటీవల ఆమోదం పొందింది . ఇది భారతదేశంలో ఈ మైలురాయిని సాధించిన మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) స్టార్టప్‌గా నిలిచింది. IPOలో రూ. 5,500 కోట్ల విలువైన షేర్ల , డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లో వివరించిన విధంగా 9.51 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉంటుంది.