ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన రాష్ట్రంలో పాలన ఆగమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తలసరి ఆదాయం పెరిగిందని ప్రభుత్వం.. రూ.5 లక్షల కోట్ల అప్పులు ఎందుకయ్యాయో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెఘా కృష్ణారెడ్డి, మై హోం రామేశ్వర్ రావు, బండి పార్థసారధి తదితరుల ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. గల్లీకో బెల్ట్ షాపు పెట్టి రాష్ట్రాన్ని మత్తులో ముంచారని భట్టి ఆరోపించారు. ప్రైవేట్ స్కూల్లో కూడా ఫీజుల నియంత్రణ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కనీసం ప్లే గ్రౌండ్ కూడా లేని స్కూళ్లు లక్షల్లో ఫీజులు వసూలు చేయడంపై భట్టి ఫైర్ అయ్యారు. నారాయణ, శ్రీచైతన్య సంస్థలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ
పాదయాత్ర చేసిన సమయంలో ప్రజా సమస్యలు చాలా వరకు తెలుసుకున్నానని భట్టి అన్నారు. ఉండేందుకు ఇల్లు కూడా లేని వారి కష్టాన్ని కళ్లారా చూశానన్నారు. ప్రియాంక అనే యువతి ఆవేదనను గుర్తు చేసుకున్న ఆయన.. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. పేదలకు భూ పంపిణీ చేయాల్సింది పోయి.. పంపిణీ చేసిన భూమిని ప్రభుత్వమే లాక్కుంటోందని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో భూమిని లాక్కొని.. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్లాట్లను చేసి అమ్ముతోందని భట్టి ఆరోపించారు.